మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 26 మంగపేట గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడైన ఎచ్ విఎస్ ప్రసాద్(52) అనారోగ్యం తో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ తదితరులు సందర్శించి ఎచ్ వి ఎస్ ప్రసాద్ మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పిoచి వారి పవిత్రమైన ఆత్మ కు శాంతి చేకూరాలన్నారు. .వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట మండల ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్,మండల నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి మండల యూత్ నాయకులు విష్ణు,తదితరులు ఉన్నారు.
