UPDATES  

 వైద్య విద్యార్థిని ప్రీతి ని ర్యాగింగ్ చేసిన సైఫ్ ని కఠినంగా శిక్షించాలి:ఐఎఫ్ టియూ నేత ఏ.మంగీలాల్

వైద్య విద్యార్థిని ప్రీతి ని ర్యాగింగ్ చేసిన సైఫ్ ని కఠినంగా శిక్షించాలి:ఐఎఫ్ టియూ నేత ఏ.మంగీలాల్
రాజ్యాంగం సాక్షిగా మహిళలకు రక్షణ కల్పించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 26
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి పై ర్యాగింగ్ చేసి మానసికంగా వేధించిన సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ ని ర్యాగింగ్ నిరోధక చట్టం క్రింద వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని,భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్ టియూ మణుగూరు ఏరియా కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం మణుగూరు పీవీ కాలనీ లోనీ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మహిళలతో కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వైద్య విద్యార్థిని ప్రీతి ని వేధించిన ఘటనలో నిందితుడు డాక్టర్ సైఫ్ కు రాజకీయ నేపథ్యం ఉందని,ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు. గతంలో కూడా బంజారాహిల్స్ మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ అత్యాచార సంఘటనలో కూడా రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు.ప్రీతి కేసులో కూడా అదే ప్రయత్నం కొనసాగుతుందని ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో, అనుమానాలకు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని అని వారు డిమాండ్ చేశారు.అదే విధంగా కాలేజీ ప్రిన్సిపాల్ పై కూడా అనుమానాలు ఉన్నాయని,అదే నిజమైతే ఆయనపై కూడా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.మహిళల వేధింపులు,చెడు వ్యసనాలు బంగారు భవిత పై బాధ్యతలేని యువతరంలో మార్పుకై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.విద్యారంగం,సినిమా రంగాలలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని దృష్టిలో పెట్టుకొని,స్త్రీని గౌరవించే విషయంలో సమూల మార్పు తెచ్చే అవసరం ఎంతగానో ఉందన్నారు.మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇందుకు వేదిక కావాలన్నారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు స్వచ్ఛంద సంస్థలు కూడా యువతలో మార్పుకై పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కే రమాదేవి, నాగమణి,కమల,వాణి,ఎం.మోహన్,శివ,సతీష్,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !