మన్యం నుంచి బూర్గంపాడు ఫిబ్రవరి26 మండలంలోని మొరంపల్లి బంజర్ (కుంజా లక్ష్మణ్ రావు నగర్) లో సోమవారం నిర్వహించే అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా జనరల్ కౌన్సిల్ మహాసభలకు వ్యవసాయ కూలీలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబు, జిల్లా నాయకులు కుంజ కృష్ణ ఆదివారం పిలుపునిచ్చారు. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశంకు ముఖ్య అతిథులుగా ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట రామయ్య, రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరావు ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈ సభలో 130 మంది ప్రతినిధులు పాల్గొని నేడు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై చర్చిస్తారని కూలి రేట్లపై చర్చిస్తారని భవిష్యత్తు కార్యక్రమం పై చర్చించి కార్యక్రమం రూపొందించుకుంటారని వారు అన్నారు. ఈ జిల్లా జనరల్ కౌన్సిల్ జిల్లా నలుమూలల నుండి ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈశ్వర్ రెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
