మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతిలో గల బుర్ధారం గ్రామంలోని శ్రీ సువర్ణ గిరిజోల లక్ష్మీనరసింహస్వామి, సమ్మక్క సారలమ్మ,శివాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ప్రాంగణంలోని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లోని ప్రజలు అధికారులు, అన అధికారులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో టిఆర్ఎస్ పార్టీ దేశంలో బలోపేతం కావాలని ఆయన కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిఅర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
