అడ్డంగా దొరికాడు… ఏసీబీ వలలో మండల సర్వేయర్ మన్యం న్యూస్ ఏటూరు నాగారం ములుగు జిల్లాలలో మళ్లీ ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఏటూరు నాగారం మండల కేంద్రంలో ని తహాసిల్దార్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం దాడులు చేశారు. తహాసిల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న బొచ్చు మహేందర్ రు10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు సదురు సర్వేయర్ ను విచారిస్తున్నారు. సదురు సర్వేయర్ ఔట్సోర్సింగ్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వస్తుంది.ఈ దాడులలో వరంగల్ ఇన్చార్జి డిఎస్పి సుదర్శన్,ఇన్స్పెక్టర్లు రవి, శ్యాంసుందర్,శ్రీను పాల్గొన్నారు.
