ప్రీతి మృతికి కారకులైన వారిని వారిని కఠినంగా శిక్షించాలి పలుచోట్ల ప్రీతికి ఘన నివాళులు మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27.. సైఫ్ అనే విద్యార్థి వేధింపులు తాలలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి కారకైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల నిరసన ర్యాలీలు, సంతాపాలు ఘన నివాళులు నిర్వహించారు. కొత్తగూడెంలో టియుడబ్ల్యూజె( టీజేఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల వద్ద ప్రీతి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కొత్తగూడెంలో పాత్రికేయులు నినదించారు. ప్రీతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెంలోని సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
