చిట్టీల పేరుతో కుచ్చుటోపి గుట్కా వ్యాపారం చేసి ప్రజలను నిలువు దోపిడీ చేసిన ఘనుడు ఆళ్లపల్లి మండలంలో ఘరానా మోసగాడు మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 27.. చిట్టీల పేరుతో కుచ్చుటోపి పెట్టి ఓ వ్యక్తి పరారైన సంఘటన ఆళ్లపల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. మార్కోడు గ్రామానికి చెందిన ఘరానా మోసగాడు చిట్టిల పేరుతో లక్షల డబ్బుతో పరారయ్యాడు మొత్తం 80 లక్షలకు పైగా మోసం చేసినట్టు సమాచారం. మర్కోడు గ్రామంలో 40 లక్షలు ఆళ్లపల్లి గ్రామంలో 10 లక్షలు ఇల్లందు లో 16 లక్షలు చిట్టీల పేరుతో వసూలు చేసి ఊడాయించాడు. గతంలో మహబూబాబాద్ లో పెద్ద ఎత్తున డబ్బులు వడ్డీకి తీసుకొని ఇవ్వకపోవడంతో బాధితులు అతని కోసం గాలిస్తున్నట్టుసమాచారం. ఇతగాడు గతంలో పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం చేసి లక్షల్లో దండుకున్నట్టు సమాచారం. ఇదే కాక అనేక అక్రమ దందాలు పాల్పడుతున్నట్లు కొందరు పేర్కొన్నారు. కాయ కష్టం చేసి అవసరాలకు వస్తాయని కూడా పెట్టుకున్న డబ్బును దోచుక పోవడంతో ప్రజలు ఎంతో ఆవేదనలో ఉన్నారు. చిట్టీల తోకల గాడిని పట్టుకొని తమ డబ్బు ఇప్పించాలని బాధితులు పూనెం రాజు , లక్ష్మి , విజయ, శేఖర్ , మల్లికార్జున్, శ్రీను, సుబ్బయ్య, య, నవీన్, నరసమ్మ లు పేర్కొంటున్నారు.
