వేసవిలో నీటి ఎద్దడి నియంత్రణ చర్యలను చేపట్టండి అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27..వేసవిలో మంచినీటి సమస్య కొరత ఏర్పడకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మిషన బగీరథ అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో వేసవిలో మంచినీటి ఎద్దడి నియంత్రణ చర్యలు, ధరణి, పాలిగన్ మ్యాపులు పోర్టల్లో అప్లోడ్ చేయుట, జిఓ 76, రెండు పడక గదులఇండ్లు కేటాయింపుకు గ్రామసభలు నిర్వహణ, పల్లె పకృతి వనాలు, తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులు, రెవిన్యూ, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ బగీరథ మంచినీటి వాల్స్ తొలగిస్తున్నారని, దీని వల్ల మంచినీరు వృధా అవడంతో పాటు మంచినీటి సమస్య ఏర్పడుతున్నట్లు తెలిపారు. మిషన్ బగీరథ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు మంచినీటి పైపులైన్లు పరిశీలన చేయాలని, ఎక్కడైనా వాల్ తొలగిస్తే తక్షణం మరమ్మత్తులు చేయడంతోపాటు ప్రజా ఆస్థులను ద్వసం చేయడం నేరమనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాల్స్ తొలగించడం వల్ల నీరు వృధా అవడంతో పాటు వేసవిలో నీళ్లు రాకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని,వాల్స్ తొలగించిన వ్యక్తులపై పోలీసు కేసులు నమోదు చేయాలని చెప్పారు. కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో రెండు పడక గదుల ఇళ్లు కేటాయింపునకు గ్రామసభలు నిర్వహించాలన్నారు.. గ్రామసభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపికపూర్తయిన తదుపరి లబ్దిదారుల వివరాలను పోర్టల్లో నమోదులు చేయాలని చెప్పారు. ధరణి పెండింగ్ దరఖాస్తులుపరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ వారంలో పెండింగ్ ప్రక్రియ యొత్తాన్ని పూర్తి చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. జిఓ నెం. 76లో కొత్తగూడెం మండలంలో పెండింగ్లో ఉన్న 230 దరఖాస్తులు విచారణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పల్లెప్రగతిలో నిర్దేశించిన విధంగా పెండింగ్ ఉన్న పల్లె పకృతి వనాలు, తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలని చెప్పారు. తదుపరి నిర్వహించు పల్లె ప్రగతి సమీక్షా సమావేశంలో ఈ అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. సీతమ్మసాగర్ నిర్మాణంలో పెండింగ్ ఉన్న కేసులను అథారిటికి సిఫారసు చేయాలనిచెప్పారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులు, యంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.
