మన్యం న్యూస్,పినపాక, ఫిబ్రవరి 27
మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో ముక్కు అనసూయ(44) మరణించడంతో ఆమె దశదిన కర్మలకు హాజరై కుటుంబ సభ్యులను పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం పరామర్శించారు. అదేవిధంగా గట్ల వెంకట నర్సారెడ్డి మరణించడంతో, ఆయన నివాసానికి వెళ్లి, నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డా శ్రీనివాసరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, పిఏసిఎస్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
