UPDATES  

 నాటు సారా స్థావరాల పై ఎక్సైజ్ దాడులు.. 400లీటర్ల పానకం స్వాధీనం

నాటు సారా స్థావరాల పై ఎక్సైజ్ దాడులు..
400లీటర్ల పానకం స్వాధీనం
నలుగురిపై బైండోవర్ కేసు నమోదు..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 28
నాటు సారా స్తావరాలపై ఎక్సైజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. మండలంలోని సుజ్ఞానపురం ములకలపల్లి గ్రామాల్లో మంగళవారం ఉదయం నాటు సారా నిర్మూలనకై అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు కొత్తగూడెం ఎన్ఫోర్స్మెంట్ టీం డిటిఎఫ్ భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుజ్ఞానపురం గ్రామంలో నాటుసారా తయారీ నిల్వచేసిన సుమారు 400 లీటర్ల బెల్లం పానకాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని ధ్వంసం చేశారు. అలాగే ములకలపల్లి గ్రామంలో నాటుసార అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి పది లీటర్ల నాటసార స్వాధీనం చేసుకున్నారు అదే గ్రామానికి చెందిన నలుగురు నాటు సారా విక్రయానికి సంబంధించిన నేరం కింద అరెస్ట్ చేసి దుమ్ముగూడెం తహాసిల్దార్ చంద్రశేఖర్ ముందు బైండోవర్ కేసు నమోదు చేశారు. మండలంలో ఎవరైనా అక్రమంగా నాటసార తయారుచేసి అమ్మకాలు కొనసాగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ తిరుపతిరావు, సిఐ ముబాసిర్, డిటిఎఫ్ కరంచంద్, సిఐ రాజారెడ్డి, భద్రాచలం ఎస్ హెచ్ ఓ ఎస్ కే రహీంమునీశా బేగం, ఎస్సై రాజేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !