UPDATES  

 తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తుంది – ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్న కేంద్రానికి ప్రజలే బుద్ధి చెబుతారు – ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్, సారపాక , మార్చి 01.. తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం నడుస్తుందని, రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి, అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం ఇర వెండి గ్రామంలో స్థలదాత తాళ్లూరి పంచాక్షరయ్య సహకారంతో 36 లక్షల 21 ఒకవేల రూపాయలతో నిర్మించిన గిడ్డంగిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, స్థలదాత తాళ్లూరి పంచాక్షరి అయ్యా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ… ప్రభుత్వం అందించే పథకాలు సైతం గతంలో ప్రజలకు అందాలంటే ఎన్నో సమస్యలు ఎదురయ్యవని, అభివృద్ధి పనుల సైతం నత్తనడకన సాగేవని ఆయన అన్నారు. నేడు ప్రజలకు కావలసిన కల్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బీమా కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ప్రభుత్వ పథకాలు త్వరితగతిన ప్రజలకు అందే విధంగా ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే రేగా కాంతారావుని పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు రేగా కాంతారావు అని ఆయన అన్నారు. అటువంటి నాయకుని ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు. మాజీ తానా అధ్యక్షులు తాళ్లూరి జయ శేఖర్ మాట్లాడుతూ… గతంలో రైతులు భద్రాచలం నుండి యూరియా బస్తాలు భుజాన వేసుకొని మోసేవాళ్ళు అని అటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించకుండా గ్రామంలోని మనమధ్యనే ఈ గోదాం కట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. తానా ఫౌండేషన్ ద్వారా ముందు ముందు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం నడుస్తుందన్నారు. రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి, అమలు చేస్తుందని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధు సంక్షేమ పథకాలు తమకు కూడా కావాలని తమ ప్రభుత్వాలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తూ సుమారు 12 లక్షల మంది ఆడబిడ్డలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని వెల్లడించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే ఇటువంటి గొప్ప ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్న మండిపడ్డారు. ఎమ్మెల్యేలను డబ్బులు ఎర్ర చూపించి కొనుక్కునే ప్రయత్నాలు చేశారని, వారికి తగిన చెప్పే విధంగా పోలీసులకు పట్టించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న గిడ్డంగులకు స్థలాన్ని స్థానంగా ఇచ్చిన పంచాక్షరి ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం 70 మంది మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మాజీ తానా అధ్యక్షులు తాళ్లూరి జయశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, బిఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, పార్టీ బూర్గంపాడు వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీ, బూర్గంపాడు మండలం యువజన విభాగం అధ్యక్షులు గోనెల నాని, బూర్గంపాడు తహసిల్దార్ భగవాన్ రెడ్డి, గుల్ మహమ్మద్, కొనకంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !