మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 01: మండల కేంద్రంలో పని చేస్తూన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఇండ్ల స్థలాలు,పక్కా గృహ నిర్మాణాలు మంజూరు చేయాలని మండల కేంద్రంలోని తహాశీల్దార్ కార్యాలయం తహాశిల్దార్ భద్రకాళికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరపున బుధవారం వినతీ అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టుల సంఘం నాయకులు ఆకుల శివ,కుంజా వెంకటేష్,కోర్సా శ్రీరామ్,కూరంసురేష్,వీరరాఘవులు,వెంకటరెడ్డి,వెంకటేశ్వర్లు,పాపారావు తదితరులు పాల్గొన్నారు.
