మన్యం న్యూస్, మంగపేట, మార్చి 01… తిమ్మంపేట జెడ్పీ హైస్కూల్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు 1999-2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు అందరూ కలిసి సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టకై భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాటుకోజు సదానందచారి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ ఆఫీసర్ తూల రవి, ఎంపీడీవో శ్రీనివాస్, ఆలేటి సుదర్శన్, దిడ్డి కాశీనాధం, సరస్వతి దేవి విగ్రహoను ఏర్పాటు చేసేటువంటి పూర్వ విద్యార్థులు లొంక రాజు, పల్నాటి సతీష్, బట్టు నర్సింహారావు,చెట్టిపల్లి ముకుందం,సతీష్ లతో పాటు ఉపాధ్యాయులు రాంబాబు, ఓదెలు, నాగభూషణం,చారి,రమేష్ తదితరులు పాల్గొన్నారు
