మణుగూరు స్థానిక గుట్ట మల్లారం నందుగల “శ్రీ విజ్ఞాన్ స్కూల్ ” నందు ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి ముందుగా చీఫ్ గెస్ట్ అయినా విద్య సంస్థల అధినేత తిప్పారెడ్డి .విజయభాస్కర్ రెడ్డి గారు పుచ్చకాయల . శంకర్ గారు , కరస్పాండెంట్ సాంబశివరెడ్డి గారు మరియు డైరెక్టర్స్ తో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కరస్పాండెంట్ సాంబశివరెడ్డి గారు మాట్లాడుతూ స్థాపించిన ప్రథమ సంవత్సరంలో పదో తరగతి ఫలితాలలో GPA 10/10 సాధించడం, అదే ఉత్సాహంతో ద్వితీయ సంవత్సరంలో విద్యార్థుల విజ్ఞానాన్ని వెలికి తీయుటకు కార్పొరేట్ స్థాయిలో విద్యానందించుటకు విద్యార్థులకు భవిష్యత్తు మార్గాన్ని సుగుమం చేయుటకు అనేక విద్య ప్రతిభా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము . దీనిలో భాగంగా ప్రతి వారం ఆర్ట్ మ్యాజిక్, వర్డ్ హౌస్, స్పీడ్ మేథ్స్, హనీ ట్యూన్ వంటి కార్యక్రమాల సాధనలో సఫలీకృతుల మయ్యము. తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ మీ యొక్క సహకారం మాకు ఉన్నంతవరకు మీ చిన్నారుల బాల్య భద్రత, భవిష్యత్తుకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చెను. వచ్చే అకాడమిక్ సంవత్సరంలో ఈ కార్యక్రమాలతో పాటు స్మార్ట్ క్లాసెస్, సైన్స్ ల్యాబ్ ల్యాబ్ ,ఇంగ్లీష్ ల్యాబ్ ,కంప్యూటర్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులను పోటీ పరీక్షలకు అనుగుణంగా ప్రిపేర్ చేస్తామని తెలియజేశారు. చీప్ గెస్ట్ అయినా భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యపై పెట్టే ఖర్చు, భారంగా కాకుండా పెట్టుబడిగా భావించినట్లయితే భవిష్యత్తులో బంగారు ఫలితాలు పొందగలుగుతారు అని తెలియజేశారు. విద్యతో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేనేజ్మెంట్ నీ కోరడం జరిగింది. ఈ వార్షికోత్సవ సందర్భంగా 10/10 సాధించినటువంటి సమీరా, జాతీయ స్థాయి handawrinng విన్నర్ స్నేహప్రియాంక, త్రివిధ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ సాంబశివారెడ్డి, డైరెక్టర్ సురేష్, శశికిరణ్,ఉపధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
