UPDATES  

 మీ భవిష్యత్తుకు మాది భరోసా.. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల,అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన. ప్రభుత్వ విప్ రేగా

మీ భవిష్యత్తుకు మాది భరోసా.. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల,అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన. ప్రభుత్వ విప్ రేగా పాఠశాలల విద్యార్థులతో గడిపిన ప్రభుత్వ విప్ రెగా ప్రభుత్వ విప్ కుస్వాగతం పలికిన చిన్నారులు. మన్యం న్యూస్ బూర్గంపాడు, మార్చి01.. మీరు చదువుకొని ఉన్నత శిఖరాలకు అవరోధించాలని అందుకు ఎదురయ్యే సమస్యల పట్ల మేము స్పందిస్తూ మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే మా ధ్యేయమని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. బుధవారం మండలం లోని సోంపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా పరిజ్ఞానం గురించి అడిగి తెలుసుకున్నారు. తొలిత పాఠశాలకు విచ్చేసిన వారికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థులతో గడిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అందుకు అనుగుణంగా మన ఊరు మన బడి ప్రణాళికలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం కాకుండా నాణ్యమైన విద్యాబోధనలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు సరికొత్త ప్రణాళికతో వారు భవిష్యత్తును తీర్చేదిద్దాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !