మన్యం న్యూస్ బూర్గంపాడు మార్చి01.. మండలంలో మొరంపల్లి బంజర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, రేగా కాంతారావు బుధవారం సందర్శించడం జరిగింది. పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు,ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ పాఠశాలలో చదివే విద్యార్థులకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విద్య బోధనలు చేస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టడం జరిగినదని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తున్నది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగా రక్షణకు శ్రీకారం చుట్టుతుంది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వర్గాల పిల్లలను ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుంది అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాల చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మను ఊరు మనబడి ద్వారా రూ.7281 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి వివిధ రకాల అభివృద్ధి పనులను చేపించడం జరుగుతుంది అన్నారు.
