మన్యం న్యూస్, పినపాక, మార్చి01… పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం పంచాయతీలో గల గోపాలరావుపేట గ్రామంలోని రామాలయంలో బుధవారం ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు. ఆలయ అర్చకులు , దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ రేగాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, గోపాలరావుపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
