మన్యం న్యూస్, దమ్మపేట, మార్చ్, 01. మండల పరిదిలోని రంగువారిగూడెం గ్రామంలో బుధవారం శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్థంభ ప్రతిష్ట బొడ్డురాయి ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వర్లు, ఇల్లందు మాజీ జెడ్పీటీసీ వీరేందర్ లు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో మూడు వేల మందికి పైగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొనగా వారితోపాటు అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా, మాజీ మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి ప్రసాద్, జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, ఎంపీటీసీ చలపతి రావు, ఆళ్ళ జంగం, దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, పల్లెల గాంధీ, రంగువారిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కొండలు, దమ్మపేట టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
