మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 02..దళిత జర్నలిస్ట్ ఫోరమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్ గురువారం ప్రకటన లో తెలిపారు. జిల్లా అధ్యక్షులు కాకటి బాబు, ఉపాధ్యక్షుడు కనుకు రమేష్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ ను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళిత జర్నలిస్టులను ఏకతాటిపైకి తేవడానికి కృషి చేయాలని వారు కోరారు. నూతన బాధ్యతలు చేపట్టిన కాకటి బాబు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి జిల్లా భాద్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. దళిత జర్నలిస్టులు అనేక ప్రాంతాల్లో వివక్షకు గురవుతున్నారని ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల మధనపడుతున్నారన్నారు. దళిత జర్నలిస్టులకు ఎక్కడ అన్యాయం జరిగిన వారి పక్షాన దళిత జర్నలిస్ట్ ఫోరమ్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.





