మన్యం న్యూస్,ఇల్లందు టౌన్.. మార్చి 14 పట్టణంలోని జేకే సివిల్ విభాగం హౌస్ కీపింగ్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు కోటేశ్వరావు(45) మంగళవారం ఉదయం అనారోగ్యంతో ఖమ్మం హాస్పటల్లో మృతిచెందారు. మధ్యాహ్నం ఆయన నివాసం ఉంటున్న సిఈఆర్ గ్రౌండ్ పక్కన గల ఇంటికి పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కార్మిక నాయకులు షేక్. యాకూబ్ శావలి(ఇఫ్టు), జే.వెంకటేశ్వర్లు(టీబీజీకేఎస్) కోటేశ్వరరావు పార్థివదేహాన్ని సందర్శించారు. జోహార్లు అర్పించారు.నాయకులు మాట్లాడుతూ… కోటేశ్వరరావు చిత్తశుద్దితో పనిచేసేవారని, వ్యక్తిగతంగానూ మంచి మనిషి అని అటువంటి ఆయన మరణించటం బాధాకరమన్నారు. మృతుడికి ఏడు సంవత్సరాలు వయసుగల అబ్బాయి ఉన్నాడన్నారు. నాయకులతో పాటు తోటి కార్మికులు సైతం ఆయన పార్థివదేహాన్ని నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి, బంధుమిత్రులకి తమ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేశారు. నివాళులర్పించిన వారిలో లింగమూర్తి,తరుణ్, రాజేశ్వరి, సైదా, జమున, దుర్గ, లీలాబాయ్,సాల్కి, జగదీష్ తదితర తోటి కార్మికులు ఉన్నారు.





