మన్యం న్యూస్ ఏటూరు నాగారం, మార్చి 15
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఎస్సై,కానిస్టేబుల్ తుది పరీక్షకు అర్హత సాధించిన గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ నిర్వహిస్తున్న శిబిరాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ బుధవారం సందర్శించినారు.ఈ సందర్భంగా పివో మాట్లాడుతూ. ఈ సదవకాశాన్ని గిరిజన అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడే విధంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పివో అన్నారు. అభ్యర్థుల శిక్షణ కార్యక్రమం వివరాలను భోజన వసతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరగతులను సబ్జెక్టుల వారీగా సమీక్షించారు.ఏ విధంగా నేర్చుకోవాలో విపులంగా అభ్యర్థులకు వివరించారు. అభ్యర్థులు పరీక్ష నాటికి సంపూర్ణంగా శిక్షణ పొంది ఉత్తమ ఫలితాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ ఏటీడీవో ప్రేమలత,ప్రిన్సిపాల్ ల్ (పి ఈ టి సి) శ్రీరాములు,సెంటర్ కన్వీనర్ కిస్టు,ఇంచార్జి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.





