UPDATES  

 ఏటూరు నాగారం లో బస్ డిపో ములుగు బస్ స్టేషన్ ను అధునికరించండి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ను కలిసి వినతి పత్రం అందజేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం, మార్చి 15

హైదరాబాద్ లో బుధవారం ఆర్టీసి ఎండీ సజ్జనార్‌ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ. ములుగు జిల్లా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం విస్తరణ లో పెద్దది అభివృద్ధి లో మాత్రం చిన్నది ఇక్కడ అనేక పర్యాటక కేంద్రాలు బొగత,లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం

దేశం లోనే అతి పెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఇటీవలే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఇలా అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో సరైన బస్సు సౌకర్యం లేదన్నారు.

.రాత్రి 7 గంటలు దాటితే కనీసం హన్మకొండ నుంచి ములుగు ప్రాంతానికి ఒక్క బస్ కూడా నడపరని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి అనేక ప్రమాదాలకు గురై చాలా మంది చనిపోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా ములుగు ప్రాంతం లో ఉన్న మారుమూల గ్రామాలకు బస్ పోని గ్రామాలు బస్ చూడని ప్రజలు ఉన్నారనీ, ములుగు జిల్లా ఏర్పాటు జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నూతన బస్ స్టాండ్ లేదు ఇప్పడు ఉన్న బస్ స్టాండ్ పూర్తిగా శిథిలావస్థలో ఉందనీ,ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్ర ప్రదేశ్,ఛత్తీస్ఘడ్,

ఓరిస్సా ఇలా అనేక రాష్ట్రాలకు ప్రయాణం సులువు అవుతుందనీ,ములుగు జిల్లా కేంద్రములో అత్యంత అధునాతనమైన బస్ స్టాండ్, ప్రయాణికులకు వీలుగా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయిన ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా తమరు చొరవ చూపి మంజూరు చేయాలని ఆర్టీసీ ఎండి కి వినతి పత్రం అందజేసి ఈ సందర్భంగా సీతక్క కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !