మన్యం న్యూస్ వాజేడు
మండలం లోని వాజేడు నాగారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఆధార్ అప్డేట్ కేంద్రం ను ప్రారంభించారు.అనంతరం జిల్లా ఈడిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, డీఏం విజయ్, తహసీల్దార్ గూడూరు లక్ష్మణ్, ఆధార్ అప్డేట్ కేంద్రం ను విజిట్ చేసి 2015 ముందు ఆధార్ దిగిన ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని తమ వెంట బ్యాంక్ ఖాతా బుక్ లేదా ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆధార్ ఆపరేటర్ గంట సర్వేశ్వరరావు, గిర్ధావరి కిసరి రాజు,పంచాయతీ కార్యదర్శి చాట్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ కల్లూరి సతీష్ సిబ్బంది పాల్గొన్నారు.