మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఇల్లందు పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నాడు స్థానిక విఠల్ రావు భవన్ నందు జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమీషన్ సభ్యులు మిరియాల రంగయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన పేదవర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చెశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుంది తప్ప పేదల బ్రతుకుల్లో మార్పులు జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నో ఏండ్లుగా పేదలకు ఉండేందుకు గూడు,కూడు కల్పించే విషయంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ ప్రభుత్వం పేదల సంక్షేమంపై కనీస ఆలోచన కూడా చేయడంలేదని ఆయన అన్నారు. ఇకనైనా ప్రభుత్వ వైఖరి మార్చుకొని పేదల సొంతింటికల నిజం చేయాలన్నారు. పేదల పక్షాన అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేయించే విదంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో, మండల పరిధిలో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం చేపట్టనునట్లు తెలిపారు. సీపీఐ ఇంటింటికి కార్యక్రమాన్ని ప్రజాసంఘాల నాయకులు, ప్రజలతో మమేకమై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వారు పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కె.సారయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, పట్టణ,మండల కార్యదర్శులు బంధం నాగయ్య, ఉడుత ఐలయ్య, వడ్ల శ్రీనివాస్, శంషుద్దిన్, బొప్పిశెట్టి సత్యనారాయణ, బజారు ఆంజనేయులు, వళి, బంటు యాదగిరి, బొల్లి కొమరయ్య, జంగంపల్లి మోజెస్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
