మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఎం పార్టీ తలపెట్టిన జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలని మండల కార్యదర్శి కారం పుల్లయ్య పిలుపునిచ్చారు. మండలంలోని మారాయిగూడెం గ్రామంలో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఈనెల 17 తేదీన హనుమకొండలో జనచైతన్య యాత్ర ప్రారంభమవుతుందని బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజలను మోసం చేస్తూ దేశం మొత్తం ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు ఈనెల 20వ తేదీన మండలంలో జరిగే జన చైతన్య యాత్రకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ యాత్రకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్, మాజీ ఎంపీ మీడియం బాబురావు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతిరావు వెంకటేశ్వర్లు ఎడమయ్యా ఎర్రయ్య భూపతి శ్రీరాములు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు