UPDATES  

 ఐటీడీఏ పీవో తో గిరిజన గ్రామాలను సందర్శించిన ఎంపీపీ జల్లిపల్లి..

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 16: మండలం పరిదిలోని గోగులపూడి, గుబ్బలమంగమ్మ తల్లి, కోయారంగపురం గ్రామాలను గురువారం ఐటిడిఏ పిఓ పొట్రు గౌతమ్, అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి సందర్శించారు. గోగుల పూడి గ్రామంలో ఏర్పాటు చేసిన నైపుణ్య క్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం గుబ్బల మంగమ్మ తల్లి గుడి సన్నిధానంలో ఐటిడిఎ నిధుల ద్వార నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. అనంతరం రెడ్డి గూడెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఎంపీపీ జల్లిపల్లి రెడ్డి గూడెం నుండి సుద్దగోతుల గూడెం బిటి రోడ్డుకు మరో 230 మీటర్లు నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మొద్దులమడ గ్రామ పంచాయతీ లోని రాళ్ళవాగు, పెద్దమిద్దె, గ్రామాలలో విద్యుత్, త్రాగు నీరు ఏర్పాటు చెపించ మని పిఓ కి వినతి పత్రం అందజేశారు. అలాగే నందిపాడు నుండి గాడ్రాల రోడ్డున మరమ్మత్తులు చేపించటానికి నిధులు మంజూరు చేపించగలరని వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్పంచ్ లు గొంది లక్ష్మణ్, భూలక్ష్మీ, యాట్ల మహేశ్వర రెడ్డి, ఎంపీడిఓ విధ్యధర రావు, తహసీల్దార్ లూథర్ విల్సన్, ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహ్మాన్, ఎంపీఓ సీత రామరాజు, సీడీపిఓ రోజారాణి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !