మన్యం న్యూస్ గుండాల: అభివృద్ధి నా ఎజెండా అని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన చెట్టు పల్లి గ్రామం నుండి లింగాపురం జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో ప్రతి రహదారిని బాధ్యతగా తీసుకొని పూర్తి చేయించే బాధ్యత తనదేనని రేగా పేర్కొన్నారు. చెట్టుపల్లి రహదారిని ఎందరో నాయకులు హామీలు ఇచ్చారే తప్ప ఆచరణలో మాత్రం ముందుకు తీసుకెళ్లలేదని ఆయన పేర్కొన్నారు తాను రెండోసారి ఎమ్మెల్యేగా ఆయన వెంటనే గుండాల మండలంలోని అన్ని రహదారులకు నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నుండి చెట్టుపల్లి రహదారి బీటీ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయని వారం పది రోజుల్లో పనులు పూర్తయి రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి నిధులు తెచ్చి పనులు చేయించాలి తప్ప హామీ ఇచ్చి కల్లబొల్లి మాటలు చెబితే పనులు పూర్తి కావని ఆయన చురకలంటించారు. నేను మాటలు చెప్పే వాడిని కానని పనులు విషయంలో ఆచరణలో తీసుకువచ్చి అభివృద్ధిని ఆకాంక్షించే వాడినని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో అంతర్గత రహదారాలన్నిటిని సిసి రోడ్లుగా వేయించడం జరిగిందని మిగిలిన వాటన్నిటిని నిధులు తీసుకువచ్చి బీటీ రోడ్లుగా మారుస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు అన్వర్,గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, అధికార ప్రతినిధి రాము,ఎస్ బి సి సెల్ అధ్యక్షులు రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు వట్టం రవి, కొరస లాలయ్య, సుధాకర్, చుక్క వీరన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
