మన్యం న్యూస్ ఇల్లందు మార్చి16:- ఇటీవల జరిగిన జాతీయ బాలల హక్కుల సంరక్షణా కమిషన్ జీ 20 సదస్సులో జిల్లా ప్రతినిధిగా పాల్గొన్న ఇల్లందు మండలం, చల్ల సముద్రం పంచాయితీ కార్యదర్శి వంశీకృష్ణ గురువారం రోజు బాలల హక్కుల కమిషన్ సూచనతో అంజనేయపురం అంగన్వాడీ కేంద్రాన్నీ సందర్శించి పిల్లలు, గర్భిణీ స్త్రీలు,బాలింతలకు సరైన పోషక విలువలున్న ఆహారం సమయానికి అందే విధంగా చూడాలని అగన్వాడి సిబ్బందికి సూచన చేశారు.
