మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం మండలం పరిధిలోని చెట్టు పళ్లి గ్రామంలో జరుగుతున్న సనప వారి ఇలవేల్పు దైవమైన గోవిందరాజులు దర్శించుకుని కొబ్బరికాయ కొట్టారు. అనంతరం అక్కడ జరుగుతున్న వాలీబాల్ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను కొద్దిసేపు వీక్షించారు. ఈ కార్యక్రమంలోకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు అన్వర్,గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య,అధికార ప్రతినిధి రాము,ఎస్ బి సి సెల్ అధ్యక్షులు రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు వట్టం రవి, కొరస లాలయ్య, సుధాకర్, చుక్క వీరన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
