మన్యం న్యూస్ చర్ల /దుమ్ముగూడెం ::
పిడుగుపాటుకు గురై 22 మేకలు,గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే చర్ల మండలం మామిడిగూడెం గ్రామానికి చెందిన కారం వీరస్వామి మేకలు గొర్రెలు రోజువారిలాగే అడవిలోకి తోలుకొని వెళ్లారు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారిగా వాతావరణం లోని మార్పులు వచ్చి ఉరుములు మెరుపులు మధ్య వర్షం మొదలైంది ఈ సందర్భంగా మేకలు గొర్రెలు అన్ని చెట్టు కిందకు రావడంతో పక్కనే పిడుగు పడటంతో 22 మేకలు పైగా మృతి చెందినట్లు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిలిందని బాధితుడు వీరస్వామి తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని వాపోయారు.