మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి మార్చి 16: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ జయంతి వేడుకలు మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు దోసపాటి రాంబాబు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం గ్రామస్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు వనమా గాంధీ,సర్పంచ్ పద్మ,ధారా ప్రదీప్,గుండెల సునీల్,గోళ్ళ పుల్లారావు,గోళ్ళ ముత్తయ్య,చల్లా పుల్లయ్య,భూక్య చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.
