మన్యం న్యూస్,ఇల్లందు రూరల్:ఆరుగాలం పండించిన మొక్కజొన్న పంట రైతుకి తీవ్రనష్టం మిగిల్చిన సంఘటన గురువారం ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామ పంచాయితీలోని మేడికుంట గ్రామములో చోటు చేసుకుంది. తెల్లం రవి అనే రైతు మొక్కజొన్న చేనుకు నిప్పు అంటుకొని చేతికి వచ్చిన ఐదు ఎకరాల పంట పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఎరగడి వలన పంట పూర్తిగా దగ్ధమైనట్టు రైతు రవి తెలిపారు. చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి అవడంతో తనకు, తన కుటుంబానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందని బాధాతప్త హృదయంతో తెలిపారు. దాదాపు ముడులక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు అధికారులను కోరారు.
