మన్యం న్యూస్, సారపాక / బూర్గంపాడు :
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సారపాక పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పంచాయతీ రిక్షా కాలనీకి చెందిన వినయ్(32) స్థానిక ఐటిసి కర్మాగారంలో క్యాజువల్ లేబర్ గా పనిచేస్తుంటాడు. కాగా కుటుంబ కలహాలు నేపథ్యంలో గురువారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వినయ్ భార్యకు వివాహేతర సంబంధం ఉందని దాని విషయమై గత కొద్ది కాలంగా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని పలువురు వెల్లడిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మనస్థాపం చెంది గురువారం తెల్లవారుజామున తన ఇంట్లోనే వినయ్ ఉరివేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. సున్నితమైన వ్యక్తిత్వం గల వినయ్ బలవన్మరణం చెందటంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ ఎస్సై సంతోష్, శ్రీను నాయక్ వివరాల సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.