మన్యం న్యూస్ గుండాల.. మార్చి 17 ..ఆళ్లపల్లి మండలం కేంద్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న రేగా క్రికెట్ కప్ క్రీడా పోటీలు శుక్రవారం ముగియడంతో వారికి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బహుమతులను అందించారు. మొదటి బహుమతి ఆళ్లపల్లి 20 వేల రూపాయల గెలుచుకోగా రెండవ బహుమతి బోడాయికుంట 15వేల రూపాయలను గెలుచుకుంది గెలుపొందిన క్రీడాకారులకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బహుమతులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని అన్నారు ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున క్రీడలను నిర్వహించామని వాటితో పాటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వాలీబాల్ నెట్టును సైతం అందించినట్లు ఆయన తెలిపారు. యువకులు ఎక్కువగా పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, మైనార్టీ జిల్లా నాయకులు అన్వర్, మండల అధ్యక్షులు నరసింహారావు, జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి,పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, పి ఎస్ ఎస్ చైర్మన్ రామయ్య, సీనియర్ నాయకులు సుబ్బారావు,పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .
