మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం, మార్చి 17..
వెంకటాపురం మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల లోన కున్న మరికల బెస్తెగూడం,ఏడు చర్ల పల్లి, సుడిబాక, గ్రామాలకు ఇంతవరకు బస్సు సౌకర్యం లేక నడకే నడకప్రాయమైంది. పరీక్షల సమయంలో అనుకున్న సమయానికి బస్సు సౌకర్యం లేక పరుగులు తీయాల్సిన పరిస్థితి పల్లెల్లో దాపురించింది
ఎన్నిసార్లు మన్యంపత్రికా ప్రతినిధులు ఈ విషయంపై రాసిన ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై చొరవ చూపకపోవడం నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది
కనీసం పరీక్ష సమయంలో అయినా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బస్సు సౌకర్యం కల్పిస్తారేమో అనుకుంటే ఆ ఆలోచన కూడా సంబంధిత అధికారులకు లేనట్టు స్పష్టమవుతుంది. అనుకున్న సమయానికి బస్సు వరకు లేక పరుగులు తీయాల్సిన పరిస్థితి పల్లెల్లో ఏర్పడింది. అసలు ఆ ఊరునే ఆ గ్రామాలనే పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదని ఊరు ప్రజలు వాపోతున్నారు.ఎందుకింత నిర్లక్ష్యం???.అంతర్గతంగా ఏం జరుగుతుంది.?
తమగ్రామాలనప్రభుత్వంఎందుకుపట్టించుకుంటలేదు.
ఇసుక క్వారీల పై ఉన్న శ్రద్ధ గ్రామాలపై ఎందుకు లేదు. అని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ఆదాయం కోసం సహజ వనరులు అయినటువంటి ఇసుకను గల్లి నుంచి ఢిల్లీ వరకు తరలించడానికి రోడ్లు వేసి మరి 100 లారీలు పెట్టి త్వరగా వారి పనులను పూర్తి చేసుకొని పోతుంటారు, ఇసుక కున్న విలువ తమపై లేదు అంటూ ప్రజలు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఎంతో బీదరికంతో చదువుకో నైనా బతుకులు మార్చుకుందామని పుస్తకం పట్టుకుంటే , బడికి కాలేజీలకు పోవడానికి దారులు సరిగ్గా లేక బస్సులు లేక ఈ గ్రామాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేకపోవడంవల్ల తమ చదువులు ఆగిపోతాయేమో అనే భయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల్లో భయాన్ని కలిగించే ఈ అధికారుల తీరు అగమ్య గోచరంగా ఉందంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.బస్సు లేక ఆటోలో వెళ్దాం అనుకుంటే మనిషికి ఆటోలు 50 నుండి 60 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు విద్యార్థినిలు గ్రామ ప్రజలు జరిగిన విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేశారు. అలాగే ఇప్పటికైనా తమ మీద తమ ఊరు మీద తమ భవిష్యత్తుల మీద సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోని బస్సు సౌకర్యాన్ని వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మాలుమూరుల గ్రామాలన్నీ ఏకకంఠంతో తమ అవసరతను తెలియజేస్తున్నారు.