మన్యం న్యూస్ దుమ్ముగూడెం, మార్చి 17
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల వ్యాప్తంగా రైతులకు తివ్రంగా నష్టం వాటిల్లిందని తెలంగాణ రైతు సంఘం సిపిఐ కార్యదర్శు సభ్యులు తాటిపూడి రమేష్ అన్నారు. మండలంలోని సిపిఐ పార్టీ ఆఫీసులో శుక్రవారం పాల్గొని ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా మండలంలోని రైతులకు తీవ్రంగా నష్టం వాటిలిందని ముఖ్యంగా మిర్చి పంట పండించే రైతులకు తుఫాను ప్రభావంతో మిర్చి రంగు మారితే ధర తగ్గే ప్రమాదం ఉందని అలానే వరి పంట సుంకు దశలో ఉండడంతో సాలు గింజలు ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు అకాల వర్షాలు నిండా ముంచాయని ఆవేదన చెందారు ఈ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.