మన్యం న్యూస్, మణుగూరు ,మార్చి17: అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని మణుగూరు జడ్పిటీసీ పోశం నర్సింహారావు అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని సాంబాయిగూడెం, కొండాయిగూడెం గ్రామాల్లో వర్షం కారణంగా నష్టపోయిన మిర్చి రైతుల పంటలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, వారికి కష్ట కాలంలో అండగా ఉంటామని కొండంత ధైర్యాన్నిఅందించడం జరిగిందన్నారు. మణుగూరు మండలంలో వర్షం కారణంగా నష్టపోయిన రైతుల వివరాలను అధికార యంత్రాంగం పరిశీలించి తక్షణమే నివేదిక అందజేయాలన్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లి రైతాంగానికి అండగా నిలబడతామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసిఎస్ ఛైర్మెన్ కురి నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామసాని వెంకట్ రెడ్డి, బత్తుల చందర్ రావు, సతీష్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
