మన్యం న్యూస్ అశ్వాపురం, మార్చి 17
అశ్వాపురం మండలం, గొల్లగూడెం గ్రామ పంచాయతీ లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం అశ్వాపురం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ జి.అరుణ అధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంను స్థానిక సర్పంచ్ పొడియం సుజత చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ వైద్య శిబిరంలో ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ జి.అరుణ సుమారు 184 మంది రోగులను పరీక్షించి ఆయుర్వేద మందులు అంద చేయడం జరిగింది.ఈ శిబిరం కు వచ్చిన రోగులకు ఆయుష్ ఆరోగ్య కరదీపికలు అందించి ఆయుర్వేద జీవన శైలి, ఔషధాల విశిష్టత,వాతావరణ మార్పుల ద్వారా శారీరకంగా వచ్చేటువంటి వ్యాధులు గృహ వైద్య చిట్కాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజేశ్వరి,సుజాత,హెచ్ వి రాజమ్మ,పీహెచ్ఎన్ సుందరి . ఆయుష్ స్టాఫ్ ఎంఎన్ఓ, శ్రీనివాస్,ఎస్ఎన్ఓ రాధిక,ఆశా కార్యకర్తలు,గ్రామపెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.