UPDATES  

 డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం – నిరుద్యోగుల తరపున పోరాడుతున్న నాయకుడు ఆర్ఎస్పి – జిల్లా కార్యదర్శి కే.వి రమణ..

మన్యం న్యూస్, సారపాక/బూర్గంపాడు :

బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కే.వీ.రమణ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని, 30 లక్షల నిరుద్యోగుల తరఫున బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సందర్భంలో వారిని పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచడం జరిగిందన్నారు. ఈ క్రమంలో వారు గృహనిర్బంధంలో సైతం ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారని వెల్లడించారు. నిరుద్యోగుల తరఫున వారికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు. ఈ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో టిఎస్పిఎస్సి కమిషన్ చైర్మన్ జనార్ధన్, పిఏ ప్రవీణ్, రాజశేఖర్ వెనుక ఉన్న పెద్ద పెద్ద తలకాయలను బయటకు లాగి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కంటి తుడుపు చర్యలుగా సిట్ కమిటీని వేసి చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు. నిజనిర్ధారణ జరగాలంటే సిబిఐ చేత విచారణ జరిపించాలిని, అప్పుడు మాత్రమే అసలైన దోషులు బయటపడతారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ బూర్గంపాడు మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ పలక ఆదిలక్ష్మి, మండల మహిళ కన్వీనర్ కేసుపాక సాధన, కొప్పుల రాంబాబు, బొల్లు సంపత్, కేసుపాక రవి వర్మ, గొడ్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !