మన్యం న్యూస్,ఇల్లందు టౌన్, మార్చి 18 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అట్టి విషయాన్ని తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ తో పాటుగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు ఎస్కే పాష, యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్ తదితరులు ఉన్నారు.