మన్యం న్యూస్, పినపాక , మార్చి 18
పినపాక మండల పరిధిలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొల్లి శేషయ్యకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన 58 వేల రూపాయల చెక్కును ఎంపీపీ గుమ్మడి గాంధీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి చేతుల మీదుగా ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ,
సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఆలస్యం కాకుండా ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఎంతో కృషి చేస్తున్నారన్నారు ఎవరైనా బాధితులు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, రైతు బంధు అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, ముఖ్య నాయకులు పోలిశెట్టి సత్తిబాబు, పొనగంటి వెంకటేశ్వర్లు, బాలక్రృష్ణ, కటకం గణేష్, దినసరపు శ్రీనివాస్ రెడ్డి, సోంపల్లి తిరుపతి, ముల్లంగి వెంకటరెడ్డి, ఎస్కే జాంగీర్, గాండ్ల అశోక్, వారా నర్సింహారావు, కంది సుధాకర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.