మన్యం న్యూస్,ఇల్లందు రూరల్ మార్చి 18:ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లెందు మండలం, ఇందిరానగర్ గ్రామపంచాయతీ మాజీ ఎంపీటీసీ పూణెం నరసమ్మ-రామయ్య దంపతుల కుమారుని వివాహానికి ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శనివారం జరిగిన ఈ వేడుకలో నూతన దంపతులు పూణెం ప్రదీప్-ప్రణవిలను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఇల్లందు మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు శోభన్, ఇందిరానగర్ వార్డు మెంబర్ నీలం రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ యూత్ ప్రెసిడెంట్ మెరుగు కార్తీక్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సత్తాల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
