UPDATES  

 పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటళ్ళు… -నాణ్యత లేని ఆయిల్ తో టిఫిన్లు.కాసుల మత్తులో అనుమతులు ఇస్తున్న అధికారులు…

  • పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటళ్ళు…
  • -నాణ్యత లేని ఆయిల్ తో టిఫిన్లు.
  • -కాసుల మత్తులో అనుమతులు ఇస్తున్న అధికారులు.
  • -ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారస్తులు.
  • – అధికారులు ఉన్నట్టా లేనట్టా.

మన్యం న్యూస్, మణుగూరు, మార్చి18: దిన దిన అభివృద్ధి చెందుతున్న మణుగూరు పట్టణంలో రోజురోజుకు హోటళ్లు తోపుడు బండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. షాపుల యజమానులు ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ షాపుల ఎదుట స్థలాన్ని రోజుకు ఇంత అని డబ్బులు వసూలు చేస్తూ తోపుడు బండ్లు పెట్టిస్తున్నారు. దీంతో మణుగూరు మున్సిపాలిటీ లో టిఫిన్ బండ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎలాంటి నాణ్యతలైన ఆయిల్ వాడుతూ వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వాడిన నూనె వాడుతూ ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మామూళ్ల మత్తులో అధికారులు మునిగి తేలుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారులు ఉన్నారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాసుల మత్తులో మున్సిపల్ అధికారులు అనుమతులు ఇస్తున్నారు అంటూ పలువురు బాహటంగానే అంటున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తున్నారా లేక ఎవరిష్టం వచ్చినట్లు వారు అనుమతులిస్తున్నారా. వ్యాపారుల ఆగడాలను అడిగే వాడు లేకపోయే సరికి ఇష్టా రాజ్యాంగ వ్యవహారిస్తున్నారు. అధికారులు వారి ఆగడాలను చూసి కూడా కళ్లున్న కబోధుల్లా ప్రవర్తిస్తున్నారు.

వారిపై ఎందుకు దృష్టి సారించడం లేదంటూ ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-తోపుడు బండ్లపై పెట్టే హోటల్ లకు ఎలాంటి అనుమతులు లేవు…

– మణుగూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ.

మణుగూరు మున్సిపాలిటీలో ప్రధాన రహదారి పక్కన తోపుడు బండ్లపై పెట్టిన హోటళ్లకు ఎలాంటి అనుమతులు లేవు. గతంలో ఇలా రోడ్డుపై పెట్టిన బండ్లను తీపించాము. తిరిగి వారు మరల తోడుబండ్లను ఏర్పాటు చేశారు. వాటి వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుంది. రోడ్లపై తోపుడుబండ్లు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటాం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !