మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 18 : విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకోవడంతో రైతులు ట్రాన్స్ ఫార్మర్ వద్ద నిరసన తెలిపారు.వివరాలు ఇలా ఉన్నాయి… తుంగారం పంచాయితీ టేకులబంజర గ్రామానికి చెందిన ఆంబోతు ఎద్దు మేతకు వెళుతూ గ్రామంలో గల ట్రాన్స్ ఫార్మర్ కు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో రైతులు విషయం తెలుసుకొని తక్కువ ఎత్తులో ట్రాన్స్ ఫార్మర్ ను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేయడం వల్ల ఆంబోతు ఎద్దు తగిలి చనిపోయిందని ఆరోపిస్తూ నిరసనగా రైతులు ట్రాన్స్ ఫార్మర్ వద్ద బైఠాయించారు. పలుమార్లు అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని, దీనికి కారణమైనా పంచాయితీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆంబోతు ఎద్దును సాంప్రదాయరీతిలో రైతులు ఖననం చేశారు.
