- ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించిన సర్పంచ్
మన్యం న్యూస్, అశ్వరావుపేట, మార్చి 18 మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం సోమవారం నుంచి నిర్వహణ ఉండగా ఎమ్మెల్యే మెచ్చా, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు మేరకు సర్పంచ్ సాదు జోత్స్నా బాయ్ గ్రామపంచాయతీలో శనివారం ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి కంటి వెలుగు కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోత్స్నా మాట్లాడుతూ అన్ని ఇంద్రియాల లో ప్రధానమైనది నేత్రమని, ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించుకొని అందత్వం బారి నుండి రక్షణ పొందాలని గ్రామపంచాయతీ ప్రజలకు ఆమె పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపర్వైజర్, ప్రధానోపాధ్యాయులు, స్కూల్ టీచర్స్, ఆశ వర్కర్లు, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.