సరిలేరు మీ కెవ్వరు
సహజ జీవనశైలికి వీరికి సాటి ఎవ్వరు
చేలైన నేలైన వారికి సమానమే
మన్యం న్యూస్ గుండాల, మార్చి 18 సహజ జీవనశైలికి వీరికి సాటి ఎవ్వరు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆడంబరాలకు ఆయన ఆమడ దూరంలో ఉంటారని ప్రతి ఒక్కరికి తెలుసు. రేగా కాంతారావు సతీమణి సైతం ఎలాంటి ఆడంబరాలు లేకుండా జీవించడంలో భర్తకు సాటిగా నిలుస్తున్నారు. గతంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గుండాల మండలంలో పర్యటించినప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రోడ్డుమీద ఉన్న ఒక కర్ర మొద్దు పై కూర్చొని సమస్యలు విన్నారు. శనివారం ఆళ్లపల్లి మండలంలో రేగా కాంతారావు సతీమణి రేగా సుధా రాణి కూడా మార్గ మధ్యలో గల బండపై కూర్చొని మార్గమధ్యలో వెళుతున్న మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భర్త రేగా కాంతారావు ఎంత సహజ జీవనశైలిలో ఉంటారో భార్య కూడా అదే రీతిలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది .