మన్యం న్యూస్, అశ్వరావుపేట, మార్చి 18: మండల పరిధిలోని గుర్రాల చెరువులో కొత్త మోటర్ నీ ఎమ్మెల్యే మెచ్చా శనివారం లాంఛనంగా ప్రారంభించారు. నీటి సమస్య ఉందని స్థానిక మహిళలు ఇటీవలే అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను తెలియజేయగా స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా వారి ప్రత్యేక నిధులతో బోరు వేయించి కొత్త మోటర్ ను స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే మెచ్చాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
