మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి, 19 అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆదివారం పలు కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామం, బండారుగుంపు సమ్మక్క సారక్క పూజారి సతీమణి రమణ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దమ్మపేట మండలం మల్కారం గ్రామంకు చెందిన రాయల కొర్రయ్య (62) అనారోగ్యంతో మరణించగా విషియం తెలుసుకొన్న సోయం వీరభద్రం వారి ఇంటికి వెళ్లి రాయల కొర్రయ్య పార్ధివదేహంకు పూలమాల వేసి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ములకలపల్లి మండలం కొత్త గంగారంలో గజ్జెల రాకేష్ వెంకటలక్ష్మి దంపతుల కుమార్తేలు గజ్జెల దారిక, దీక్షిక ఓణీల వేడుక కార్యక్రమంకు హాజరు అయ్యి నూతన వస్త్రాలు సమర్పించి, చిన్నారులను ఆశీర్వదించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ భూక్య పత్తిలాల్ సోదరుడు హరిలాల్ కొన్నిరోజులు క్రీతం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాడ సానుభూతి తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో ఎక్కడైనా సరే మంచి, చేడు కార్యక్రమాలకు, ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా ముందుగా స్పదిస్తానని ఈ సందర్బంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం అన్నారు.
