మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మార్చి 19
మణుగూరు మండల పరిధి లోని కమలాపురం గ్రామం లో నివాసం వుంటున్న పుల్లమ్మ 84 యేండ్ల వృద్దురాలు,ఆరోగ్య పరంగా,ఆర్థిక పరంగా ఒడిడుదుకులు ఎదుర్కుంటున్నదని తెలుసుకున్న” వీ ఫర్ యూ” చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆదివారం పుల్లమ్మ ఇంటిని సందర్శించి ఆమెకు రెండు నెల లకి సరిపడ నిత్యావసరాలను అందించారు.ట్రస్ట్ ను ఉద్దేశించి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, నిరుపేదలకు,ఎవరూ లేని వృద్దులకు,సహాయం అందించడం చాలా ఆనందంగా వుంది అని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేస్తామని వారు తెలిపారు. యువత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని వారు సూచించారు.