UPDATES  

 అమ్మో చీటింగ్.. వేరే సర్వే నెంబర్ పై ప్లాట్ల విక్రయాలు..

  • అమ్మో చీటింగ్..
  • వేరే సర్వే నెంబర్ పై ప్లాట్ల విక్రయాలు
  • విక్రయదారుడు ఇంటి ముందు లబ్ధిదారులు ఆందోళన
  • నిలువునా మోసపోయామంటూ ఆవేదన

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 19… వేరే సర్వే నెంబర్ తో ఉన్న భూమిని ఇతరులకు అంటగట్టి ఓ వ్యక్తి సొమ్ము చేసుకున్నాడు. లక్షల రూపాయలను చెల్లించి ప్లాట్లు కొనుక్కున్న లబ్ధిదారులు విస్తుపోయే నిజం తెలిసేవరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు సర్వే నెంబర్ పై కొనాల్సిన భూమిని వేరే సర్వే నెంబర్ పై తమకు ప్లాట్లు విక్రయించారని తెలుసుకున్న లబ్ధిదారులు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ ప్రాంతంలో ఉన్న సదరు విక్రయిదారుడు ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అసలేం జరిగిందంటే సర్వే నెంబరు 15 33, 39, 37, 38, నెంబర్లలో 8 ఎకరాల ఎనిమిది కుంటలు భూమిని సుమారు 120 మంది లబ్ధిదారులకు 2013 సంవత్సరంలో పల్లపుర భాను ప్రకాష్ అనే వ్యక్తి విక్రయించారు. సంబంధిత లబ్ధిదారులకు 200 గజాలు చొప్పున ఒక్కొక్క ప్లాటు రూ 2. 50 లక్షలు లబ్ధిదారులు కొనుగోలు చేశారు. సుమారు 8 ఏళ్లు గడిచిన తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి సదరు సర్వే నెంబరు 1536 నెంబర్లు పది ఎకరాల ఏడు కుంటలు భూమి తనదేనని గతంలో కొనుక్కున్న లబ్ధిదారుల కొనుగోలు చేసుకున్న ప్లాట్లు తన సర్వే నెంబర్లు ఉన్నాయని లబ్ధిదారులకు గతంలో విక్రయించిన ప్లాట్లు తన సర్వే నెంబర్ కు చెందిందని తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేయడంతో ప్లాట్లు కొనుగోలు చేసుకున్న లబ్ధిదారులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. 8 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుక్కున్న లబ్ధిదారులు ప్రహరీలు బేస్మెంటన్ రూములు కట్టుకున్న లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు . వేరే సర్వే నెంబర్ తో తమకు ప్లాట్లు అంటగట్టిన భాను ప్రకాష్ పై చట్ట పర్యంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భాను ప్రకాష్ ఇంటి ముందు సంబంధిత లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న సుజాతనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సంబంధిత లబ్ధిదారులకు వారించారు. ఆ సమయంలో భాను ప్రకాష్ ఇంటి వద్ద లేకపోవడంతో భాను ప్రసాద్ కు సంబంధించిన వ్యక్తులు నాలుగు రోజుల వ్యవధి గడువు ఇవ్వాలని కొరడంతో సంబంధిత లబ్ధిదారులు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. వేరే సర్వే నెంబర్ వేసి తమకు ప్లాట్ లను అంటగట్టిన సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !